తెలంగాణలో కొత్తగా 206 కేసులు.. 10 మరణాలు

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Update: 2020-06-06 15:50 GMT
Representational Image

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(శుక్రవారం) ఒక్క రోజే 143 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అధికంగా 206కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 152 కేసులు వెలుగు చూశాయి. ఇవాళ ఒక్కరోజే 10 మంది బాధితులు మరణించారు. రంగారెడ్డి 10, మేడ్చల్ 18, నిర్మల్ 5, యాదాద్రి 5, మహబూబ్ నగర్ 4, జగిత్యాల 2, నగర్ కర్నూల్ 2, మహబూబాబాద్ 1, వికారాబాద్ 1, జనగాం 1, గద్వాల్ 1, భద్రాద్రి 1, నల్గొండ 1, కరీంనగర్ 1, మంచిర్యాల లో ఒక్కో కేసు నామోదయ్యింది. 

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 123 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3496కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,663 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1,710 మంది డిశ్చార్జ్ అయ్యారు.

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,987 కేసులు నమోదు కాగా, 294 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,36,657 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,15,942 ఉండగా, 1,14,072 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా,6,642 మంది వ్యాధితో మరణించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.




 


Tags:    

Similar News