Coronavirus : తెలంగాణలో 943కి చేరిన పాజిటివ్ కేసులు

Update: 2020-04-22 15:33 GMT

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 15 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 10, సూర్యాపేట జిల్లాలో 3, గద్వాల జిల్లాలో 2 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన బుటెటిన్‌లో ప్రకటించింది.

ఇవాళ ఒక్కరు మృతి చెందడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 24కి చేరిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసులు 943కి చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 194 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా..725 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News