తెలంగాణలో కొత్తగా 127 కేసులు.. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 110

Update: 2020-06-04 15:52 GMT
Representational Image

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న(బుధవారం) ఒక్క రోజే 74 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అధికంగా 127 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 110 కేసులు వెలుగు చూశాయి. ఆదిలాబాద్‌లో 7, రంగారెడ్డిలో 6, మేడ్చల్‌లో 2, సంగారెడ్డి, ఖమ్మంలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. .

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో పోరాడి 105 మంది మరణించారు. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,147కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1455 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి ఇప్పటివరకు 1587 మంది డిశ్చార్జ్ అయ్యారు.  




Tags:    

Similar News