Coronavirus Tension in Singareni: సింగరేణిలో కరోనా కలకలం..విధుల బహిష్కరణ

Update: 2020-07-27 12:47 GMT
ప్రతీకాత్మక చిత్రం

Coronavirus Tension in Singareni: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజులు వెయ్యకి పైగానే నమోదవుతున్నాయి. గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. సామాన్యుల దగ్గర నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కరోనా వారియర్స్ కి కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల్లో కూడా కరోనా కలకలం రేపుతోంది. సింగరేణి ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు అధిమవుతున్నాయి. అంతే కాదు కరోనా బారిన పడి మృతి చెందిన కార్మికులు కూడా ఉన్నారు. కాగా సింగరేణి కార్మికులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లాక్డౌన్ ప్రకటించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. లేని పక్షంలో తామే స్వయంగా విధులు బహిష్కరిస్తామని సింగరేణి కార్మికులు అంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే పెద్దపెల్లి జిల్లా రామగుండం అర్జీ-1 ఏరియాలోని 11ఏ బొగ్గుగనిలో పని చేసే కార్మికులు ఉదయం షిఫ్టులో స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. పలువురు వైరస్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని, కరోనా లక్షణాలతో పలువురు కార్మికులు మృతి చెందారని ఆరోపిస్తూ గనిపై నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సింగరేణిలో లాక్డౌన్ ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు. అనతరం స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇంటికి వెళ్ళిపోయారు.

లేదంటే స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇళ్లలోనే ఉంటామని కార్మికులు తెలిపారు. గనుల్లో పనిచేసే కార్మికుల్లో ఎవరికి కరోనా ఉందోనన్న ఆందోళన వారి కుటుంబాల్లో సైతం నెలకొంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల భద్రత గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News