రాష్ట్రంలో 33కు చేరిన కరోనా కేసులు.. రేపటి నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలు రద్దు

Update: 2020-03-23 10:51 GMT
telangana health minister etela rajender

తెలంగాణలో కరోనా మరింత కోరలు చాస్తోంది. తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే, బాధితులు కోలుకుంటున్నారని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కేసులు 33కు పెరిగాయి. మంగళవారం నుంచి గాంధీ, కింగ్‌ కోఠి, చెస్ట్‌, ఫీవరాసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి.

ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. రానున్న 10 రోజులు రాష్ట్రానికి చాలా కీలకమన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజులు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పారు. నిత్యావసర సేవలు, దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిపారు. ఇంట్లో నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటికి రావాలని సూచించారు. 

Tags:    

Similar News