Huzur Nagar: శానిటైజర్స్ పంపిణీ చేసిన ఆర్ఎంపి వైద్యులు

Update: 2020-04-16 15:39 GMT
RMP Doctors Masks Distribution

హుజూర్ నగర్: పట్టణంలో కరోనా వైరస్ నేపథ్యంలో నియోజకవర్గ ఆర్.ఎం.పి గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు మన్సూర్ అలీ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మండల ఆర్.ఎం.పి సభ్యుల సహాయ సహకారాలతో జంగాల గూడెంలో ఉంటున్న 50 కుటుంబాలకు మాస్కులు, హ్యాండ్ శానిటైజర్స్, డెటాల్ సబ్బులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఆర్ఎంపీ వైద్యుల సంఘం అధ్యక్షులు మన్సూర్ అలీ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించాలంటే తప్పకుండా మనమందరం వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తరచుగా చేతులను శుభ్రపరుచుకోవలిసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. దీనిలో భాగంగానే ఈరోజు రెక్కాడితే కాని డొక్కాడని ఈ కాలనీ వాసులకు శానిటైజర్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.

అనంతరం హుజూర్ నగర్ మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని. అదేవిధంగా చేతులను ఏవిధంగా పరిశుభ్ర పరుచుకోవాలి కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ మండల ఆర్ఎంపీ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి సన్నిధి వెంకటేశ్వర్లు , సహాయ కార్యదర్శి షేక్ మీరా, కోశాధికారి ఆత్కూరి శ్రీనివాస్, ఆర్ఎంపీ వైద్యుల సంఘం సభ్యులు మరియు హుజూర్ నగర్ మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



Tags:    

Similar News