Coronavirus Effect on Tourism: కరోనా ఎఫెక్ట్ తో పర్యాటకులు లేక వెల వెలబోతున్న సాగర్!

Update: 2020-07-22 09:36 GMT

Coronavirus Effect on Tourism : కరోనా వైరస్ వచ్చి రాగానే.. ఎంటర్ టైన్ మెంట్ కు బ్రేక్ లు వేసింది. దీంతో టూరిజం స్పాట్లు వెలవెలబోతున్నాయి. నాలుగు నెలలుగా జన సందడి లేక పర్యాటక కేంద్రాలు పరితపిస్తున్నాయి. ఒకప్పుడు వర్షం కాలం రాగానే నాగార్జున సాగర్ అందాలను వీక్షించేందుకు టూరిస్ట్ లు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ జలాలు పుష‌్కలంగా ఉన్నా జనాలు లేక వెలవెలబోతోంది.

నాగార్జున సాగర్ ప్రపంచ పర్యాటక క్షేత్రం. రెండు తెలుగు‌ రాష్ట్రాలకు సాగు తాగు నీటిని అందించే బహుళార్ధక ప్రాజెక్టు నాగార్జున సాగర్.. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత రాతి‌కట్టడం దీనికి తోడు గౌతమ‌బుద్దుడు నడియాడిన‌ నేల అందుకే ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ అని‌పేరు వచ్చింది. విశాల నిర్మాణం గా ఉన్న నాగార్జున సాగర్ ను చూడటానికి దేశ విదేశాలకు చెందిన‌ పర్యాటకులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు వీకెండ్స్ పెస్టివల్ టైం లో కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. నాగార్జున సాగర్ తో పాటు బుద్దవనం ,లాంచింగ్ ,నాగార్జున కొండ కు లాంచింగ్ లో ప్రయాణం ఇవన్నీ నాగార్జున సాగర్ కేంద్రం గా ప్రధాన ఎసెట్స్ కానీ ఇవన్నీ ఓకప్పటి ఐదు నెలల కిందట ముచ్చట.

ఇపుడు నాగార్జున సాగర్ దగ్గర చూస్తే చూద్దామన్న మనుషులు కనిపించడం లేనంత‌ దారుణ పరిస్థితి ఉంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నాగార్జున సాగర్ దగ్గర పర్యాటకులు లేక బోసిపోయిన పరిస్థితి కళ్లకు కనిపిస్తుంది నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర పర్యాటకుల తాకిడి నిల్...బుద్దవనాన్ని సందర్శించే జపాన్ ,నేపాల్ ,శ్రీలంక, మయన్మార్, ఇండోనేషియా, చైనా ,మన దేశం లోని ఇతర రాష్ట్రాల కు చెందిన బౌద్ద బిక్షువుల పర్యటన లేక వెలవెల బోతుంది. నాగార్జున సాగర్ వీకెండ్స్ లో సాగే నాగార్జున కొండ లాంచీ ప్రయాణం అగిపోయి దానికి తాళం పడింది దీంతో పర్యాటకుల‌ మీదే ఆధారపడిన కుటుంబాలు ఉపాధి లేక బోరుమంటున్నారు. నాగార్జున సాగర్ ప్రత్యేకతే టూరిజం స్పాట్ వీకెండ్స్ తో పాటు చాలా మంది విఐపిలు ఇక్కడకు వచ్చేవారు వారి వల్ల వందల‌ కుటుంబాలకు ఉపాధి దొరికేది కానీ నేడు ఉపాధి లేక జీవనం‌ కష్టమైందని స్థానికులు అంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి తగ్గితేనే నాగార్జున సాగర్ కు పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నాగార్జున సాగర్ జలాశయం ప్రాంతం చాలా అందంగా కనిపిస్తున్న పర్యాటకులు లేక వెలవెల‌బోతున్న పరిస్థితి కనిపిస్తుంది.

Tags:    

Similar News