Telangana Corona Cases: తెలంగాణలో తగ్గుతున్న కరోనా వైరస్ కేసులు!
Telangana Corona Cases: తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి.
Corona Virus (file image)
Telangana Corona Cases | తెలంగాణ లో కరోనా వైరస్ కేసులు కొంత మేర తగ్గుతున్నాయి. తాజాగా తెలంగాణ లో 1,416 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో తెలంగాణ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,40,048 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి తెలంగాణ లో 1,341 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణ లో 18,241 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని తెలంగాణ లో ఇప్పటి వరకూ 2.20 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.