Corona Vaccine: తెలంగాణలో టీకా డోసులు కరువు

Corona Vaccine: చాలీచాలని టీకా నిల్వలు * అందుబాటులో 3 రోజులకు సరిపడా వ్యాక్సిన్ మాత్రమే

Update: 2021-04-12 01:58 GMT

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Corona Vaccine: తెలంగాణలో కొవిడ్‌ టీకా డోసులు మరో మూడు-నాలుగు రోజుల వరకే సరిపోనున్నాయి. ఈ నెల 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్‌ జరపాలని ప్రధాని మోడీ ఇటీవల పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో టీకా కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. ఐదు రోజులుగా వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.

5 లక్షల, 9వేల, 34 మంది తొలి డోసు తీసుకున్నారు. అంటే రోజుకు సగటున లక్ష మంది టీకా వేయించుకున్నారు. 28వేల, 920 మంది రెండో డోసు తీసుకున్నారు. శనివారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 5.66 లక్షల డోసులే ఉన్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో 85 వేల మందే తీసుకున్నారు. దీంతో 4.80 లక్షల డోసులే మాత్రమే ఉన్నట్లు సమాచారం. కేంద్రం నుంచి ఈ మూడు రోజుల్లో టీకాలు రాకపోతే వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వైద్యారోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో కొవాగ్జిన్‌ రెండో డోసు స్టాకు లేన్నట్లు తెలుస్తోంది. తొలి డోసు తీసుకున్నవారు రెండో డోసు కోసం టీకా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను రోజుకు 2 లక్షలకు పెంచామని, ప్రస్తుతం 5.66 లక్షల డోసులే ఉన్నాయని కేంద్రానికి తెలంగాణ సీఎస్‌ లేఖ రాశారు.

Tags:    

Similar News