Warangal MGM Hospital: వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం
Warangal MGM Hospital: ఎంజీఎం ఆస్పత్రిలో రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు
వరంగల్ ఎంజీఎంలో కరోనా కలకలం
Warangal MGM Hospital: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సూపరింటెండెంట్‌కు కరోనా సోకింది. ఆస్పత్రిలో ఇప్పటివరకు వైద్యులు, సిబ్బంది కలిపి మొత్తం 93 కేసులు నమోదయ్యాయి. వీరిలో 10 మంది ప్రొఫెసర్లు, నలుగురు ఎస్‌ఆర్‌లు, 21 మంది పీజీ విద్యార్థులు, 23 మంది నర్సింగ్ సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక 19 మంది పారామెడికల్, 15 మంది సిబ్బందికి కూడా కరోనా సోకింది.