Corona Booster Dose: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బూస్టర్ డోసులు

Corona Booster Dose:అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన తెలుగు రాష్ట్రాల అధికారులు

Update: 2022-01-10 04:45 GMT

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బూస్టర్ డోసులు

Corona Booster Dose: దేశ వ్యాప్తంగా కరోనా.. ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనిలో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు వైద్యారోగ్యశాఖ వ్యాక్సిన్‌ వేస్తూ వస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ముందు వరుసలో ఉండి సేవలు అందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లకు ఇవాళ్టి నుంచి బూస్టర్‌ డోస్‌లను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెకండ్‌వేవ్‌ సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన వైద్య, ఆరోగ్య, పారిశుధ్య, పోలీసు తదితర రంగాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వారికి టీకాలను వేశారు.

థర్డ్‌వేవ్‌ ముంచుకొస్తున్నందున ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు మరోమారు బూస్టర్‌ డోసు వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు వైద్యారోగ్యశాఖ అధికారులు. బూస్టర్‌ డోసు ఇవ్వడం ద్వారా మరింత భద్రతా భావాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను చేపడుతున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తికావస్తోంది. ప్రస్తుతం థర్డ్‌వేవ్‌ ప్రారంభం కావడంతో తిరిగి బూస్టర్‌డోసు వేయనున్నారు.

వీరితో పాటు మరికొన్ని రోజుల్లో 60 ఏళ్లు పైబడిన వారికి సైతం బూస్టర్‌ డోస్‌ వేయాలని అధికారులు నిర్ణయించారు. కొవిషీల్డ్‌, కోవ్యాక్సిన్‌ వేసుకున్న వారికి మరోమారు బూస్టర్‌డోసు వేయనున్నారు. వీలైనంత ఎక్కువ మందికి బూస్టర్‌డోసు వేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. మొదటి, రెండో వేవ్‌లలో తన ప్రభావం చూపిన కరోనా వైరస్‌ ప్రజలను మరోమారు ఇబ్బందులకు గురి చేసేందుకు సిద్ధమవుతుంది.

Tags:    

Similar News