పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నఅవిభక్తకవలలు.. ఇద్దరికీ వేరువేరుగా హాల్ టికెట్లు జారీ

Update: 2020-03-02 13:24 GMT
పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నఅవిభక్తకవలలు.. ఇద్దరికీ వేరువేరుగా హాల్ టికెట్లు జారీ

ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అవిభక్త కవలలు వీణా వాణీలు సిద్ధం అవుతున్నారు. వారు పరీక్షలు రాయడానికి విద్యాశాఖ అనుమతులిచ్చింది. వారిద్దరిని ప్రత్యేకంగా భావించిన ఎస్సెస్సీ బోర్డు వేరు వేరుగా పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను అదేశించింది.

అవిభక్త కవలలు వీణవాణీలు ఈ నెల 19 నుంచి జరిగే పదోతరగతి పరీక్షలు సిద్ధం అవుతున్నారు. వారు పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఎస్సెస్సీ బోర్డు కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. అందుకుగానూ ఇద్దరికీ వేరు వేరుగా హాల్ టికెట్లు జారీ చేసింది, అంతేకాదు ప్రస్తుతం వారు ఉంటున్న స్టేట్ హోం సమీపంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు.

2019లో వీణావాణీలు వెంగళ్ రావు నగర్ ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో పదవ తరగతి అడ్మిషన్ పొందారు. ఈ ఏడాది జరిగే పదో పరీక్షలపై వారు ఆసక్తిగా ఉన్నారు అన్ని సబ్జెక్ట్‌లను అక్కాచెల్లెల్లు ఇంట్రెస్ట్ గా చదువుతున్నారు. ఎగ్జామ్స్ ఎప్పుడు వచ్చిన మేము రెడీ అంటున్నారు.

వీణా వాణీలు పదవ తరగతి పరీక్షలు రాయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారని బాలసదనం ఆర్డేడీ జీకే. సునంద తెలిపారు. ఇప్పటికే వారు పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యయని, ఇద్దరు వేరు వేరుగా పరీక్షలు రాయడానికి రెడీ అంటున్నారు. పదోతరగతిలోకి అడుగు పెట్టగానే వీణావాణీలకు ప్రత్యేక టీచర్ తో క్లాస్ లు చెప్పించారు. అవిభక్త కవలలకు విద్యాశాఖ ప్రత్యేక అనుమతులు ఇవ్వడంతో వీణవాణీలు ఉత్సహంగా ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధం అవుతున్నారు. 


Full View


Tags:    

Similar News