Mahbubnagar: పాలమూరు ప్రజాదీవెన సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్‌రెడ్డి
Mahbubnagar: MVS కళాశాల మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ
Mahbubnagar: పాలమూరు ప్రజాదీవెన సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్‌రెడ్డి
Mahbubnagar: మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల ప్రచారం ప్రారంభించనుంది కాంగ్రెస్. పాలమూరు ప్రజాదీవెన సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాదీవెన సభ కోసం ఇప్పటికే సీఎంను సీడబ్ల్యూసీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. మార్చ్ 6వ తేదీన సాయంత్రం 4 గంటలకు మహబూబ్‌నగర్‌లోని MVS కాలేజీ మైదానంలో భారీగా పాలమూరు ప్రజా దీవెన సభను నిర్వహించనున్నారు. కొడంగల్.. నారాయణపేట ఎత్తిపోతల ప్రకటనతో పాలమూరులో ఇప్పటికే కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక మార్చి 6న జరగబోయే సభలో సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.