రాహుల్ పర్యటన తర్వాత టీ.కాంగ్రెస్ కొత్త ఉత్సాహం

*ఈనెల 16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం

Update: 2022-05-13 05:30 GMT

రాహుల్ పర్యటన తర్వాత టీ.కాంగ్రెస్ కొత్త ఉత్సాహం

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలు పల్లె బాట పట్టనున్నారు. వరంగల్‌లో ఇచ్చిన రైతు డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లాలని రాహుల్ గాంధీ ఆదేశాలతో నెల రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం PAC వేదికగా రూట్ మాప్ సిద్ధం చేసి ముఖ్య నేతలకు పీసీసి దిశానిర్దేశం చేయనున్నారు.

రైతుల కోసం ప్రకటించిన డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 16న పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కాబోతుంది. వచ్చే నెల రోజుల్లో డిక్లరేషన్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాల్సిన కార్యాచరణను PAC సిద్ధం చేయనుంది. సమావేశానికి PAC సభ్యులతో పాటు DCC అధ్యక్షులను కూడా పిలవాలని నిర్ణయించింది. ఈ నెల 21 నుండి ప్రతి నాయకుడు పల్లె బాట పట్టాలని నిర్ణయించింది. పల్లె పల్లెకు కాంగ్రెస్ అనే నినాదంతో కార్యాచరణను చేపట్టబోతుంది.

PCC నుండి కిందిస్థాయి కార్యకర్త వరకు పల్లెబాట నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కమిటీలను వేయాలని పార్టీ ప్లాన్ చేస్తుంది. సుమారు 300 మంది నాయకులతో డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లాలని చూస్తుంది. రెండు మండలాలకు ఓ సీనియర్ నేతను నియమంచి ప్రతి నాయకుడు 40 గ్రామాల్లో పర్యటించేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు పార్టీలో ముఖ్య నాయకులను కూడా జిల్లాల వారీగా సమీక్షలు సమావేశాలు పెట్టీ రైతులకు డిక్లరేషన్‌లోని అంశాలు తెలియజేసే ప్రయత్నం చేయాలని ఆలోచిస్తుంది. ఈ 40 గ్రామాలను 4 పార్లమెంట్ పరిధిలో ఉండాలని అక్కడ స్థానిక నాయకులతో పాటు డిక్లరేషన్‌పై అవగాహన కల్పించడానికి వచ్చిన నాయకులు కో-ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తుంది.

Tags:    

Similar News