వరద బాధితులకు 10వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్.. జీహెచ్‌ఎంసీ ముట్టడికి కాంగ్రెస్
Congress: గన్‌పార్క్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వరకు ప్రదర్శన
వరద బాధితులకు 10వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్.. జీహెచ్‌ఎంసీ ముట్టడికి కాంగ్రెస్
Congress: ఇవాళ జీహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వరదల్లో జనం అల్లాడుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఇవాళ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. వరద బాధిత కుటుంబాలకు పదివేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గన్‌పార్క్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లనున్న కాంగ్రెస్ నేతలు.. GHMC దగ్గర ధర్నా చేపట్టనున్నారు. ధర్నా అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు.