Congress: టికెట్ కేటాయింపులో హస్తవ్యస్థం..
Congress: ఎన్నికల కమిటీ సభ్యులతో వన్ టు వన్ నిర్వహించనున్న కమిటీ
Congress: టికెట్ కేటాయింపులో హస్తవ్యస్థం..
Congress: పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలకు దారితీస్తోంది. నియోజకవర్గాలవారీగా ఆశావహుల పేర్లు మాత్రమే అందుబాటులో ఉంచడంతో సభ్యులు అభ్యంతరాలు తెలిపారు. ఆశావహులు పార్టీకి అందించిన సేవలు, వారి సామాజిక నేపథ్యం తదితర వివరాలు ఇవ్వకుండా పరిశీలన ఎలా చేస్తామంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో దరఖాస్తుల పరిశీలనను వాయిదా వేశారు. ఇవాళ మరోసారి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.
ఆశావహుల దరఖాస్తుల పరిశీలన తర్వాత పీఈసీ సమర్పించనున్న నివేదికలు, వివిధ వర్గాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరణ కోసం రేపు స్ర్కీనింగ్ కమిటీ చైర్మన్ మరళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవాని, బాబా సిద్దిఖీ హైదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల పాటు వివిధ వర్గాల నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. పీఈసీ నివేదికలు, సర్వేలు, సేకరించిన అభిప్రాయాల ఆధారంగా తొలి జాబితా కూర్పుపై కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇక వెరిఫై చేసిన అభ్యర్థుల జాబితాను ఒక్కో నియోజకవర్గానికి మూడు పేర్లను స్ర్కీనింగ్ కమిటీకి పంపించనుంది ప్రదేశ్ ఎన్నికల కమిటీ. రేపటి నుంచి మూడు రోజులపాటు మురళీధరన్ నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఎన్నికల కమిటీ సభ్యులతో వన్ టు వన్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మొదటి దశ అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎన్నికల కమిటీకి పంపించనుంది. వీలైనంత త్వరగా తొలి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. సెప్టెంబర్ రెండో వారంలో అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.