Congress: నాలుగు స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల.. నిజామాబాద్ నుంచి తిప్పర్తి జీవన్ రెడ్డి

Congress: నలుగురు అభ్యర్థులకు జాబితాలో చోటు

Update: 2024-03-28 02:14 GMT

Congress: నాలుగు స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల.. నిజామాబాద్ నుంచి తిప్పర్తి జీవన్ రెడ్డి

Congress: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆచితూచి అడుగేసింది. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై గెలుపుగుర్రాల ఎంపికపై తీవ్ర కసరత్తు చేశారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశానికి హజరయ్యారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ అభ్యర్థిత్వాలను ఆశిస్తున్న వారి పేర్లను అధిష్టానవర్గం దృష్టికి తీసుకెళ్లారు. పోటీచేసేందుకు ఆసక్తి చూపినవారి స్థితిగతులు, సామాజిక సమీకరణ, ప్రజలతో నాయకుల సంబంధాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నాలుగు రాష్ట్రాలకు సంబంధించి 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి 8వ జాబితాను విడుదల చేశారు.

తెలంగాణ నుంచి నలుగురు అభ్యర్థులకు 8వ జాబితాలో అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వుడు లోక్ సభ స్థానానికి ఆత్రం సుగుణని ఖరారు చేశారు. నిజామాబాద్ లోక్ సభ స్థానానికి తిప్పర్తి జీవన్ రెడ్డిని ఎంపిక చేశారు. మెదక్ లోక్ సభ స్థానానికి నీలం మధును కాంగ్రెస్ అభ్యర్థిత్వం వరించింది. భువనగిరి లోక్ సభ స్థానానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ అధిష్టాన వర్గం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఖరారైన నలుగురి అభ్యర్థిత్వాలతో ఇప్పటిదాకా 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Tags:    

Similar News