Venkat Reddy: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్ కామెంట్స్‌

Venkat Reddy: తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంతరెడ్డిని నియమించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2021-06-27 15:00 GMT

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Venkat Reddy: కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్ కామెంట్స్‌ చేశారు. తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంతరెడ్డిని నియమించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ ఎన్నిక జరిగినట్టు తనకు ఢిల్లీ వెళ్లాక తెలిసిందన్నారు. హుజూరాబాద్‌లో రాబోయే ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కనీసం డిపాజిట్లు తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా టీ టీడీపీ మాదిరిగానే మారబోతోందని వ్యాఖ్యానించారు. టీపీసీసీలో కార్యకర్తలకు గుర్తింపు లేదన్నారు. రేపట్నుంచి ఇబ్రహింపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. తనను కలిసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, రేవంత్‌రెడ్డి సహా ఎవరూ కలిసేందుకు ప్రయత్నించొద్దని కోమటిరెడ్డి తెలిపారు.

ఇకపై గాంధీ భవన్ మెట్లెక్కనన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ... టీడీపీ నుంచి వచ్చిన నేతలు తనను కలవద్దన్నారు. అది టీపీసీసీకాదని, టీడీపీ పీసీసీగా మారిందని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు మాదిరిగా నోటుకు పీసీసీ ఎన్నిక జరిగిందని విమర్శించారు. పీసీసీని ఇంఛార్జి అమ్ముకున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. తన నియోజకవర్గం జిల్లాకే పరిమితమవుతానన్నారు. తన రాజకీయ భవిష్యత్తును కార్యకర్తలే నిర్ణయిస్తారని తెలిపారు. సోనియా, రాహుల్ గాంధీపై విమర్శలు చేయనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News