డీజీపీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ బృందం..
బీఆర్ఎస్ దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్న నేతలు
డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు
Revanth Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ బృందం డీజీపీని కలిసింది. నాగర్‌కర్నూల్ జిల్లా మార్కండేయ ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడి ఘటనపై రేవంత్‌రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేదని ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వమే దాడులు చేయిస్తోందని విమర్శించారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆధారాలతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డీజీపీని కోరామన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు మిగతా వారిపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని కోరామన్నారు. ఈ విషయంలో సీఎస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు సీఎస్ వత్తాసు పలుకుతున్నారని రేవంత్ ఆరోపించారు. అంతకుముందు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో డీజీపీ అంజనీ కుమార్‌ను కలిశారు టీ కాంగ్రెస్ నేతలు.