టీఆర్ఎస్‌ నిరంకుశత్వానికి దుబ్బాక తీర్పు జవాబు: విజయశాంతి

టీఆర్‌ఎస్ అహంకారపూరిత ధోరణి.. కేసీఆర్ నిరంకుశ పోకడలకు దుబ్బాక తీర్పు జవాబన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. దొరల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా.. మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారన్నారు.

Update: 2020-11-10 16:21 GMT

టీఆర్‌ఎస్ అహంకారపూరిత ధోరణి.. కేసీఆర్ నిరంకుశ పోకడలకు దుబ్బాక తీర్పు జవాబన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి. దొరల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా.. మలిదశ ఉద్యమ ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరులూదారన్నారు. ఓటమిపై సమీక్షించుకుంటామన్న టీఆర్ఎస్‌.. ఎన్నిక సందర్భంగా వారి వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలన్నారు. లక్ష మెజారిటీ ఆశించి... ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి ఎందుకు దిగజారాల్సి వచ్చిందో సమీక్షించుకోవాలని సూచించారు.

ఇక అటు సంచలన విజయం సాధించి బీజేపీ మొదటిసారి దుబ్బాకలో విజయకేతనం ఎగురవేసింది. 14వందల ఓట్లకు పైగా తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత మీద బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం 23 రౌండ్లలలో సాగిన లెక్కింపులలో రఘునందన్ రావు కు 62,772 ఓట్లు రాగా, సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి.. ఓట్ల శాతంగా చూసుకుంటే.. బీజేపీకి 39%, టీఆర్ఎస్ కి 37% ఓట్లు వచ్చాయి.

Tags:    

Similar News