Gutha Sukender Reddy: విమర్శలు చేస్తూనే ఒక్క ఛాన్స్ అంటారా..?
Gutha Sukender Reddy: కాంగ్రెస్, బీజేపీలలో సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే ధైర్యం లేదు
Gutha Sukender Reddy: విమర్శలు చేస్తూనే ఒక్క ఛాన్స్ అంటారా..?
Gutha Sukender Reddy: గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌పై తీవ్రంగా విమర్శలు చేస్తూ ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆలస్యం కావడానికి కాంగ్రెసే కారణమని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు డైరెక్షన్‌లో రేవంత్ రెడ్డి నడుస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పే ధైర్యం లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.