Congress: పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతోన్న కాంగ్రెస్

Congress: తెలంగాణలోనే మొదలుకానున్న రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశాలు

Update: 2024-01-24 11:45 GMT

Congress: పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతోన్న కాంగ్రెస్

Congress: 2024 లోక్‌స‌భ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. పార్టీ శ్రేణుల‌ను సిద్ధంచేసే ప‌నిలో నిమగ్నమైంది. రేపటి నుంచి రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశాలను ప్రారంభించనుంది. సంస్థాగత కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆఫీస్ బేరర్ల సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. రాష్ట్రస్థాయి కార్యకర్తల సమావేశాలు తెలంగాణలోనే ప్రారంభంకానున్నాయి.

ఆ తర్వాత జనవరి 28న ఉత్తరాఖండ్‌లో, 29న ఒడిశాలో, ఫిబ్రవరి 3న ఢిల్లీలో, ఫిబ్రవరి 4న కేరళలో, 10న హిమాచల్ ప్రదేశ్‌లో, 11న పంజాబ్‌లో పార్టీ రాష్ట్రస్థాయి కార్యకర్తల సదస్సును కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. తమిళనాడులో ఫిబ్రవరి 13న, జార్ఖండ్‌లో 15న మ‌హాస‌భ‌లు జరగనున్నట్టు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.

Tags:    

Similar News