Ponguleti Srinivas: తెలంగాణ యువత భవిత కోసం.. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది
Ponguleti Srinivas: రానున్న రోజుల్లో జిల్లా కేంద్రంలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు
Ponguleti Srinivas: తెలంగాణ యువత భవిత కోసం.. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది
Ponguleti Srinivas: తెలంగాణ యువత భవిత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. నిరుద్యోగులకు నైపుణ్య విద్య అందించేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు మంత్రి పొంగులేటి.
రానున్న రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. స్కిల్ వర్సిటీలో వివిధ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పే 17 రకాల సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ కోర్సులను రూపొందించామన్నారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ కోర్సుల బోధనాంశాలకు రూపకల్పన చేస్తామన్నారు.