Congress: ప్రజా సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ఫోకస్

Congress: నిరుద్యోగ సమస్యపై దృష్టిసారించిన కాంగ్రెస్

Update: 2021-09-21 04:51 GMT

కాంగ్రెస్ (ఫైల్ ఇమేజ్)

Congress: అధికార టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒంటరి పోరాటం చేసింది. కొత్తగా పీసీసీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి కేవలం ప్రజా పోరాటాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగ సమస్యను గుర్తించారు. ప్రధానంగా యువతను తమ పార్టీవైపు ఆకర్షించడానికి నిరుద్యోగ సమస్యనే ప్రధాన ఎజెండాగా రేవంత్ భావించారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజే వరుసగా పది రోజులు నిరుద్యోగ సమస్యలపై యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత అధికార పార్టీ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం దళిత ఓట్లను తమఖాతాలో వేసుకోవడానికి దళితబంధును తెరమీదకు తేవడంతో కాంగ్రెస్ ఆదిలాబాద్ ఇంద్రవెల్లిలో దండోరా సభలను ప్రారంభించింది. రావిరాల, మెడ్జెట్, గజ్వెల్ సభలకు ప్రజలను మంచి స్పందన రావడంతో రెట్టించిన ఉత్సహంతో భవిష్యత్తు కార్యచరణ పై హస్తం పార్టీ దృష్టిపెటింది.

కాంగ్రెస్ పార్టీ కొత్త ఎత్తుగడను తెరమీదకు తీసుకురావాలని భావిస్తోంది. జాతీయస్థాయిలో జరిగే.. బీజేపీయేతర పార్టీలను కలుపుకుపోవడానికి ఇప్పటి నుండే ప్రయత్నాన్ని ప్రారంభించింది. ముందస్తుగా తమతో కలిసి వచ్చే పార్టీలతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందుకు జాతీయ పార్టీ డైరెక్షన్ మేరకు ఇటీవల విపక్షాలతో గాంధీభవన్‌లో సమావేశం నిర్వహించి ఉమ్మడి కార్యచరణను ప్రకటించింది. ఇక్కడ టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీతో వ్యతిరేకించే పక్షాలన్నీంటితో హస్తం పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ ఉమ్మడి పోరుకు తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటిపార్టీతో పాటు వామపక్షాలు, ఎంఎల్ పార్టీలు కూడా కలిసి ఉద్యమించడానికి అంగీకరించాయి. ఈ కూటమికి టీటీడీపీ, వైఎస్సార్‌టీపీ మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఉమ్మడి పోరులో భాగంగా ఈనెల 22న ధర్నాచౌక్ దగ్గర మహాధర్నా, 27న భారత్ బంద్, 30న అన్ని జిల్లాల కలెక్టరేట్లల్లో వినతి పత్రాల కార్యక్రమాలు నిర్వహించడానికి అంగీకరించాయి.

ఇప్పటికే కాంగ్రెస్ పోరాటం చేస్తున్నా విపక్షాలు కలిసి రావడం హస్తం పార్టీకి అదనం బలంగా భావిస్తోంది. వీటితోపాటు ఈ ఉమ్మడి కార్యచరణకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోదండరాం కీలక పాత్రపోషించిన్నట్లు తెలుస్తోంది. ఆయనే ఈ ప్రతిపాదను తెరమీదకు తెచ్చి టిఆర్ఎస్ బిజేపి వ్యతిరేక శక్తలను ఏకంగా చేస్తే ప్రభుత్వ వ్యతిరేక పోటు చీలకుండా భవిష్యతులో టిఆర్ఎస్ , సియం కేసిఆర్ ఎదుర్కోవడం ఈజి అవుతుందని కోదండ తెరవేనుక ఉండి కార్యచరణను సిద్దం చేసిన్నట్లు హస్తం పార్టీలో చర్చ సాగుతోంది. అయితే. టిఆర్ఎస్ ప్రనభుత్వంలో మేజర్ తప్పిదాల పై గట్టిగా పోరాటం చేయాలని ఉమ్మడి పార్టీలు భావిస్తున్నయట. తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్నా ధరణి సమస్యలు, పోడు భూములు, నిరుద్యోగ సమస్యల పై ప్రధానంగా ఫోకస్ పెట్టడానికి హస్తం పార్టీ పక్క ప్రణాళిక రూపిందించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎన్నికలు కాంగ్రెస్ సిద్దంగా ఉందనే సంకేతాన్ని అందించడానికే హస్తం పార్టీ సంకేతాలు ఇస్తున్నట్లు కనపిస్తోంది.

Tags:    

Similar News