Congress: లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన కాంగ్రెస్

Congress: ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్‌లో ఎంపీ సీటుపై చర్చ

Update: 2024-01-31 03:13 GMT

Congress: లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన కాంగ్రెస్

Congress: లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన కాంగ్రెస్ గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ భేటీ నిర్వహించింది. పీఈసీ కమిటీ ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ ఆశిస్తున్న నాయకుల పేర్లను తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల కమిటీకి డీసీసీ అధ్యక్షులు పంపిచారు.

మొత్తం తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు గానూ.. 189 మంది ఆశావహుల పేర్లతో లిస్ట్ కమిటీ అందింది. అయితే.. ఈ సమావేశంలో తమకు ఎంపీ సీటు కావాలని జగ్గారెడ్డి, శివసేనారెడ్డి అడిగినట్టు తెలుస్తుంది. సమావేశంలోనే అడగటంతో.. ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. మరోవైపు అన్ని అంశాల్లో బలంగా ఉన్న లీడర్లకే ఎంపీ సీటు ఇవ్వాలని జిల్లాల నుంచి నేతలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News