Congress: పొత్తులపై సీపీఎంకు కాంగ్రెస్ పిలుపు.. ఇవాళ భేటీకీ రావాలని ఆహ్వానం

Congress: సీపీఎం ఆశించే స్థానాలు భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ

Update: 2023-08-28 10:15 GMT

Congress: పొత్తులపై సీపీఎంకు కాంగ్రెస్ పిలుపు.. ఇవాళ భేటీకీ రావాలని ఆహ్వానం

Congress: ఎన్నికల్లో పొత్తులపై సంప్రదింపులకు సీపీఎం నేతలను కాంగ్రెస్ నేతలు పిలించారు. ఇవాళ భేటీకీ రావాలని ఆహ్వానించారు. అయితే బీఆర్ఎస్‌తో ఎదురైనా పరిణామాల దృష్ట్యా సీపీఎం ఆచితూచి వ్యవహరిస్తుంది. కాంగ్రెస్‌ ఇచ్చే స్పష్టతను బట్టి సీపీఎం భేటీకి హాజరుకావాలా వద్దా... అని నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ కాంగ్రెస్ నేతలతో భేటీ ఉండదని సీపీఎం వర్గాలు స్పష్టం చేశారు. నిన్న సీపీఐ నేతలతో కాంగ్రెస్ చర్చలు జరిపింది. ఇక పొత్తులతో కాలాయాపన చేసి.. మోసపోవద్దని కామ్రేడ్లు భావిస్తున్నారు. సీపీఎం ఆశించే స్థానాల్లో కాంగ్రెస్‌కు రెండూ సిట్టింగ్ స్థానాలే ఉండటంతో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ స్థానాలను సీపీఎం ఆశిస్తుంది.

Tags:    

Similar News