Nagarkurnool: అవగాహన కార్యక్రమాలను ఆవిష్కరించిన కలెక్టర్ శ్రీధర్

Update: 2020-04-29 13:11 GMT

నాగర్ కర్నూల్: పట్టణ కళాభారతి సాంస్కృతిక కళా సంస్థ కళాకారులచే తయారుచేయబడిన కరోనా పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాటలు, హరికథ, బుర్రకథ, గొల్ల సుద్దులు, రాక్షసి అంతం, కరోనా తత్వం, కరోనా జాగ్రత్తలతో రూపొందించిన పెన్ డ్రైవ్ ను బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చేతుల మీదుగా విడుదల చేశారు.

జిల్లా ప్రజలు లాక్ డౌన్ సందర్భంలో అపోహలు చెందకుండా స్వీయ నిర్బంధంలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకునేలా కళాకారులచే రూపొందించడం జరిగిందని కళాభారతి అధ్యక్షులు ఎస్ బి శ్రీనివాస్, పద్మాలయ ఆచార్య తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిష్ణాతులైన కళాకారులచే అనేక రకాల కళారూపాలతో రూపొందించి ప్రజలను జాగృత పరిచేలా కృషి చేసినందుకు కళాభారతి సంస్కృతి సంవత్సర వారిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అభినందించారు. 

Tags:    

Similar News