Mancherial: వినాయకుని మెడకు చుట్టుకొని బుసలు కొట్టిన పాము
Mancherial: సోషల్ మీడియాలో వీడియో వైరల్
Mancherial: వినాయకుని మెడకు చుట్టుకొని బుసలు కొట్టిన పాము
Mancherial: మంచిర్యాల జిల్లా లక్సీట్టిపెట్‌లోని కోర్ట్ ఆవరణలో శివశంకర్ గణపతి మండపంలో గణపతి విగ్రహం పై నాగు పాము చుట్టుకుని అందరిని అశ్చర్యపరిచింది. నాగుపాము వినాయకుని దగ్గర ప్రత్యక్షమై మెడకు చుట్టుకొని బుసలు కొట్టడం ప్రారంభించిందని అక్కడి స్థానికులు తెలిపారు. దీంతో అప్రమత్తం అయిన నిర్వాహకులు స్నేక్ క్యాచర్‌కి సమాచారం ఇచ్చారు. దీంతో అతడు వచ్చి పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కచ్చితంగా దైవనిర్ణయమే అని కొందరూ అంటుంటే అది యాదృశ్చికం అని మరికొందరు అంటున్నారు.