14కు పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. మహబూబ్‌నగర్‌ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ ఫోకస్..

CM Revanth: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 14కు పైగా సీట్లల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్..అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది.

Update: 2024-04-08 14:45 GMT

14కు పైగా స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు.. మహబూబ్‌నగర్‌ సెగ్మెంట్‌పై సీఎం రేవంత్ ఫోకస్..

CM Revanth: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 14కు పైగా సీట్లల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్..అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. సొంత ఇలాకా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్ రీజియన్‌ పై సీఎం రేవంత్ ఫోకస్ పెట్టారు. కొడంగల్ లోని తన నివాసంలో మండలాల వారీగా ముఖ్య నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు రేవంత్. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

గెలుపే ధ్యేయంగా ముందుకు సాగాలని...అందుకు ప్రణాళిక బద్ధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన దానికంటే ఎక్కువగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడాలని నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ నుంచి సాధ్యమైనన్నీ ఎక్కువ సీట్లు గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News