Telangana cabinet expansion: నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి విషేస్..!!

elangana cabinet expansion: కొద్ది నెలలుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమయ్యింది.

Update: 2025-06-08 05:11 GMT

Telangana cabinet expansion: నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి విషేస్..!!

Telangana cabinet expansion: కొద్ది నెలలుగా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమయ్యింది. మంత్రి వర్గ విస్తరణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీసీ సామాజిక వర్గం నుంచి వి. శ్రీహరి ముదిరాజ్, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు కొత్తగా మంత్రివర్గంలోకి చేరడం ఖాయం అయ్యింది.

నేడు మధ్యాహ్నం 12గంటల నుంచి 12.20గంటల మధ్య వీరిని ప్రమాణా స్వీకారం చేయించనున్నారు. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రస్తుతం అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి విషేస్ తెలిపారు. నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ వివేక్ వెంకట స్వామి గారు, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారి కి నా అభినందనలు. శాసన సభ లోఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ రామచంద్రు నాయక్ గారి కి నా అభినందనలు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 

Tags:    

Similar News