Revanth Reddy: నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Revanth Reddy: పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్‌

Update: 2024-02-21 01:58 GMT

Revanth Reddy: నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నియోజవకవర్గ పర్యటించబోతున్నారు. నియోజకనవర్గంలో 3 వేల 961 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ, ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్, హైలెవల్ బ్రిడ్జీ, అప్రోచ్ రోడ్డు పనులతో పాటు.. కోస్గీలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ భవన నిర్మాణ పనలకు సీఎం శంఖుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇందు కోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News