Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: ఈసీ సమావేశంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2024-03-07 04:56 GMT

Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏఐసీసీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్‌.. హాజరుకాబోతున్నారు. సమావేశంలో లోక్‌ సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

అభ్యర్ధుల ఎంపిక బాధ్యతను సీఎం రేవంత్‌రెడ్డికి అధిష్టానం అప్పగించింది. దీనితో పాటు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ రెడ్డి హై కమాండ్‌కు వివరించనున్నట్లు సమాచారం. తొలి జాబితాలో సీటు దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటికే తమకు వీలైనంత మేరకు ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో ఏకాభిప్రాయంతో ఉన్న సీట్లను ఏఐసీసీ ప్రకటించనున్నట్లు సమాచారం. మార్చి 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Tags:    

Similar News