Revanth Reddy: ఢిల్లీలో రెండోరోజు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Revanth Reddy: కాసేపట్లో ఖర్గేను కలవనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2024-02-06 05:01 GMT

Revanth Reddy: ఢిల్లీలో రెండోరోజు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటితో కలిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గేను కలవనున్నారు. కాసేపట్లో తెలంగాణకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మహబూబ్‌నగర్ బీఆర్‌ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి అన్న కుమారుడు మన్నే జీవన్‌రెడ్డి సహా పలువురు నేతలు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. మరో వైపు బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News