ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: ఏఐసీసీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం

Update: 2024-01-04 01:49 GMT

ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశానికి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అదే విధంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ త్వరలో చేపట్టనున్న భారత్‌ న్యాయ యాత్ర పై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో పాటు సీఎల్పీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు.

Tags:    

Similar News