CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారబరిలోకి సీఎం రేవంత్

CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు.

Update: 2025-02-24 04:41 GMT

CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారబరిలోకి సీఎం రేవంత్

CM Revanth Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నరేందర్‌రెడ్డి తరఫున సీఎం ప్రచారం నిర్వహిస్తారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు.

హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11గంటల 30నిమిషాలకు బయలుదేరి నిజామాబాద్‌ చేరుకుని అక్కడ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుని ప్రచార సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు కరీంనగర్‌ సభలో మాట్లాడుతారు. ఈసారి పార్టీ అధికారంలో ఉన్నందున సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచి తీరాలని సీఎం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ ప్రచార సభల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్‌ రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొంటారు.

Tags:    

Similar News