Revanth Reddy: గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే.. పెద్దన్నలా ప్రధాని మోడీ సహకరించాలి

Revanth Reddy: తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించాలి.. ప్రధానిగా మీరు ఒక్కమాట చెబితే మహారాష్ట్ర అంగీకరిస్తుంది

Update: 2024-03-04 07:11 GMT

Revanth Reddy: గుజరాత్‌లా తెలంగాణ అభివృద్ధి చెందాలంటే.. పెద్దన్నలా ప్రధాని మోడీ సహకరించాలి 

Revanth Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటే అభివృద్ధికి ఆటంకం కలుగడంతో పాటు ప్రజలకు నష్టం జరుగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగా పని చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో మాత్రమే చేయాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతతో ముందుకెళ్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం తమకు మోడీ పెదన్నలాగా సహకరించాలన్నారు. మూసీ రివర్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని రేవంత్‌రెడ్డి కోరారు.

Tags:    

Similar News