Revanth Reddy: తెలంగాణలోని వీధిదీపాలను సీసీసీకి అనుసంధానం చేయాలి

Revanth Reddy: ఐసీసీసీలో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

Update: 2025-09-15 11:09 GMT

Revanth Reddy: ఐసీసీసీలో మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వీధిదీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీలను నుంచి టెండర్స్ పిలవాలని...వీధిదీపాలకు సోలార్ పవర్‌ను వినియోగించడం పైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం అన్నారు. ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని తెలిపారు.

తెలంగాణలోని అన్ని వీధిదీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని, ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలన్నారు. గ్రామాల్లో వీధిదీపాల నిర్వహణను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని...వీధిదీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచ్‌లకే ఉందన్నారు. దానిని ఎంపీడిఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి పోల్ సర్వే చేయించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

Full View


Tags:    

Similar News