Revanth Reddy: బీఆర్ఎస్ ఒక దిక్కుమాలిన పార్టీ.. వారి వెనకాల ఉండాల్సిన అవసరం నాకు లేదు
Revanth Reddy: బీఆర్ఎస్‌లో పరిణామాలు, కవిత సస్పెన్షన్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
Revanth Reddy: బీఆర్ఎస్‌లో పరిణామాలు, కవిత సస్పెన్షన్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ అంతా దిక్కుమాలిన పార్టీ అంటూ.. వారి వెనకాల ఉండాల్సిన అవసరం కానీ.. సమయం కానీ తనకు లేవని చెప్పారు. కడుపుకి అన్నం తినే ఎవ్వరూ వారి వెంట ఉండరన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో పంపకాల్లో తేడాలు రావడంతో.. వాళ్లకు వాళ్లే కడుపుల్లో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారని సెటైర్లు వేశారు సీఎం రేవంత్.
నేను కవిత వెనుకున్నాను అని కొందరు అంటున్నారు. హరీశ్‌రావు, సంతోష్ వెనుక ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనుకా లేను. ఇప్పటికే ప్రజలు వాళ్లను తిరస్కరించారు. అలాంటి వారితో కలిసే సమయం నాకు లేదు. ప్రజల వెంట మాత్రమే ఉంటాను. మీ కుల, కుటుంబ పంచాయితీల మధ్య మమ్మల్ని తీసుకురావొద్దు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.