Revanth Reddy: బ్రిటిష్‌ హైకమిషనర్‌ లిండీ కామెరాన్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ భేటీ అయ్యారు.

Update: 2025-09-18 10:29 GMT

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ భేటీ అయ్యారు. విద్య, సాంకేతిక రంగాలలో తెలంగాణకు పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు లిండీ కామెరాన్ తెలిపారు.

ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యూకే ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక చెవెనింగ్ స్కాలర్‌షిప్ను తెలంగాణలోని మెరిట్ విద్యార్థులకు కో-ఫండింగ్ ప్రాతిపదికన అందించేందుకు అంగీకరించారు. దీంతో పాటు, తెలంగాణ విద్యార్థుల సౌకర్యం కోసం హైదరాబాద్ నుంచే యూకేలోని యూనివర్సిటీలు తమ కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

తెలంగాణలో తీసుకురానున్న కొత్త విద్యా విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి బ్రిటిష్ హైకమిషనర్‌కు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన లిండీ, ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు శిక్షణ ఇచ్చేందుకు తమ సహకారం అందిస్తామని తెలిపారు.

అంతేకాకుండా, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్, అకాడమీ విభాగాల్లో బ్రిటిష్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. ఈ అంశాలపై కూడా బ్రిటిష్ హైకమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సమావేశంలో డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News