Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో ఎంఐఎం ఎమ్మెల్యేల భేటీ
Revanth Reddy: పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చ
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డితో ఎంఐఎం ఎమ్మెల్యేల భేటీ
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఐఎం ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సారధ్యంలో ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు..రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరించిన ఎంఐఎం పార్టీ...సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడంతో ఆసక్తి నెలకొంది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి..అన్ని శాఖలపై వరుస రివ్యూలు నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.