CM Revanth Reddy: రీల్‌లోనే కాదు… రియల్ లైఫ్‌లోనూ హీరో నాగార్జున: సీఎం రేవంత్ ప్రశంసలు
CM Revanth Reddy: హైదరాబాద్ గచ్చిబౌలి ట్రాఫిక్‌ను తగ్గించేందుకు నిర్మించిన పీజేఆర్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నటుడు నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించారు.

స్వచ్ఛందంగా భూమిని అప్పగించిన నాగార్జున
CM రేవంత్ తెలిపిన వివరాల ప్రకారం, N కన్వెన్షన్ సెంటర్ పరిధిలో ఉన్న 2 ఎకరాల భూమిని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ విషయంలో నాగార్జున నిజమైన హీరో అని ప్రశంసించారు. “ఇలాంటివే నిజమైన సామాజిక బాధ్యతగా చెప్పుకోవచ్చు,” అని సీఎం పేర్కొన్నారు.
నాలాలు, చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు
నగరంలోని నాలాలు, చెరువులు గతంలో అనేక ఆక్రమణలకు గురయ్యాయని, వాటిని హైడ్రా మిషన్ ద్వారా తొలగిస్తున్నామని సీఎం వివరించారు. “హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే లక్ష్యం,” అని స్పష్టం చేశారు.