Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌

Revanth Reddy: అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

Update: 2024-01-08 11:46 GMT

Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఫోకస్‌

Revanth Reddy: మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్‌ రెడ్డి. అందులో భాగంగా 5 జిల్లాల్లోని 7 పార్లమెంట్‌ స్థానాలపై సమీక్ష చేస్తున్నారు సీఎం రేవంత్. హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ స్థానాల నేతలతో చర్చిస్తున్నారు. ఈ సమీక్షా సమావేశానికి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలతో పాటు.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ఏడు స్తానాల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News