Revanth Reddy: కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందన్న రేవంత్
Revanth Reddy: వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే మేడిగడ్డ పర్యటన
Revanth Reddy: కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందన్న రేవంత్
Revanth Reddy: మేడిగడ్డ బ్యారేజ్ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైందని ఆరోపించారు. 97 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి.. 97 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు..
అన్నీ తానై కట్టానని చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా.. నోరు విప్పడంలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికిరాదని, పునర్ నిర్మాణమే శరణ్యమని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందన్నారు రేవంత్. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే మేడిగడ్డ పర్యటన అంటూ ట్వీట్ చేశారు రేవంత్.