Revanth Reddy: అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం

Revanth Reddy: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.

Update: 2025-11-10 06:28 GMT

Revanth Reddy: అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ సంతాపం

Revanth Reddy: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ గారి ఆకస్మిక మృతి పట్ల సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను రాసిన అందెశ్రీ గారి మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తుచేశారు. అందెశ్రీతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతం కొత్త స్వరాలతో రూపకల్పన చేసుకున్నామని, అందెశ్రీతో కలిసి పంచుకున్న ఆలోచనలు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందంటూ... ఆయన మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనలో, జాతిని జాగృతం చేయడంలో ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

అందెశ్రీ మృతి పట్ల సంతాపం తెలిపిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన టుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

అందెశ్రీ మృతి పట్ల మాజీమంత్రి హరీష్‌రావు సంతాపం తెలిపారు. అందెశ్రీ అకాల మరణం బాధాకరమని ఆయన అన్నారు. అందెశ్రీ మృతి పట్ల కేటీఆర్ సంతాపం తెలిపారు. అందెశ్రీ అకాల మరణం బాధాకరమన్నారు కేటీఆర్‌. కుటుంబసభ్యులకు కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థించారు.

ప్రముఖ కవి, రచయిత, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డాక్టర్ అందెశ్రీ మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు సాహితీ లోకానికి ఇది తీరని లోటు అని అన్నారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... అందెశ్రీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు చంద్రబాబు.

Tags:    

Similar News