New Ration Cards in Telangana: తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త..కొత్త రేషన్ కార్డు దరఖాస్తు తేదీలను ప్రకటించిన సీఎం రేవంత్
New Ration Cards in Telangana: తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేనివారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు లైన్ క్లియన్ చేయారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. పేద, మధ్య తరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాలకు వైట్ రేషన్ కార్డుల ద్వారా బియ్యం, నిత్యవసరాలను పంపిణీ చేస్తుంది. అయితే తెలంగాణ మాత్రం అర్హులైన చాలా మంది కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు ఎంతో కాలంగా ఆశగా వేచిచూస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పిందనుకోవాలి. కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు లైన్ క్లియర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
గురువారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ ప్రాసెస్ ను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎక్కువగా 6 గ్యారెంటీల కంటే కూడా రేషన్ కార్డులకు ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. 6 గ్యారెంటీలకు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోవడంతో తాజాగా రైతు రుణమాఫీకి ఆధారం రేషన్ కార్డునే తీసుకోవడంతో రేషన్ కార్డుల కోసం కాళ్లు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు.
రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సీఎం అధికారులను సూచించారు.