మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌‌పై సీఎం రేవంత్ రివ్యూ.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

మొంథా తుఫాన్ ప్రభావిత పరిస్థితులపై సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. మొత్తం 16 జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో... అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్ అలర్ట్ చేశారు.

Update: 2025-10-30 09:13 GMT

మొంథా తుఫాన్‌ ఎఫెక్ట్‌‌పై సీఎం రేవంత్ రివ్యూ.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ 

మొంథా తుఫాన్ ప్రభావిత పరిస్థితులపై సీఎం రేవంత్ సమీక్ష చేపట్టారు. మొత్తం 16 జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో... అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్ అలర్ట్ చేశారు. ఇది వరి కోతల కాలం.. అనుకోని ఉపద్రవం రైతులకు నష్టం చేకూరుస్తుందన్నారు. ఇప్పటికే నిన్న కురిసిన జడివానకు పలు జిల్లాలో వరదలు సంభవించాయి. జాతీయ రహదారులు సహా... గ్రామాలు... కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా వరంగల్ ఊర చెరువుకు వరదపెరగడంతో.. పలు కాలనీలు జలమయం అయ్యాయి. హంటర్‌ రోడ్డులోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. వరంగల్‌లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను వెంటనే ముమ్మరం చేయాలని సీఎం రేవంత్ అధికారులను.. మంత్రులను ఆదేశించారు. వెంటనే అవసరమైనన్ని పడవలను.. తెప్పించాలని. వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న NDRF సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అందరి సెలవులను రద్దు చేసి.. క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. అవసరమైన చోట హైడ్రా సిబ్బందని, సామాగ్రిని వాడుకోవాలన్నారు.

ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, ఎక్కడైనా వరదలో ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగునీటితో పాటు​, ఫుడ్ పాకెట్లు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తానని సీఎం రేవంత్ తెలిపారు. తుఫాన్ ప్రభావిత జిల్లా ఇంచార్జ్‌ మంత్రులు, కలెక్టర్‌లు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రాణనష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని... ఏ ఒక్కరి ప్రాణాలకు నష్టం జరగడానికి వీల్లేదని సీఎం రేవంత్.. అధికారులకు ఆదేశించారు.

Tags:    

Similar News