పటాన్‌చెరులో రేపు సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. పరిశీలించిన గూడెం మహిపాల్‌రెడ్డి
Mahipal Reddy: అన్నివర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు
పటాన్‌చెరులో రేపు సీఎం కేసీఆర్ బహిరంగ సభ.. పరిశీలించిన గూడెం మహిపాల్‌రెడ్డి
Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రేపు జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని పటాన్‌చెరు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్‌రెడ్డి కోరారు. సభా ప్రాంగణాన్ని గూడెం మహిపాల్‌రెడ్డి పరిశీలించారు. నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. దేశానికే ఆదర్శంగా నిలిచే పథకాలను ప్రవేశపెట్టి... అన్నివర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పటాన్‌చెరులో 9 వేల కోట్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్యాలను ప్రచారం చేస్తున్నా.... ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.