నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
* నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన * హాలియాలో ధన్యవాద సభలో ప్రసంగించనున్న కేసీఆర్
CM KCR Visited Nagarjunasagar in Nalgonda District
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. కాసేపట్లో హాలియాలో ధన్యవాద సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా సభ దగ్గర భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు టీఆర్‌ఎస్ శ్రేణులు. మరోవైపు సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియా సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటిస్తారని జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే టికెట్ రేసులో నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డిల పేర్లు ఉన్నాయి.