CM KCR: ఇవాళ నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..

CM KCR: బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం

Update: 2023-06-04 05:41 GMT

CM KCR: ఇవాళ నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..

CM KCR: ఇవాళ నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్మల్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత 4 గంటల 40 నిమిషాలకు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం 5గంటల 5 నిమిషాలకు జిల్లా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఆరున్నర గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాత్రి ఏడున్నర గంటలకు సభ ముగించుకొని రోడ్డు మార్గాన హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం కేసీఆర్.

మరోవైపు నిర్మల్ జిల్లాలో సీఎం కేసీఆర్ టూర్ సందర్భంగా ముందస్తు అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. నిర్మల్ , భైంసా పట్టణాల్లో పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. నిర్మల్ లో బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఇంటి ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. 

Tags:    

Similar News