నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR: మిగతా పార్టీలకు అందనంతా వేగంగా బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

Update: 2023-10-29 01:45 GMT

నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR: ఓ వైపు చేరికలు… మరోవైపు ప్రచారంలో జోష్‌ పెంచింది బీఆర్‌ఎస్‌ పార్టీ. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు కారును టాప్‌గేర్‌లో తీసుకెళ్తున్నారు. మిగతా పార్టీలకు అందనంతా వేగంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పదునైనా మాటలతో ప్రత్యర్థులను డిఫెన్స్‌లో పడేస్తున్నారు. ఇక హ్యాట్రిక్‌ కొట్టడమే తర్వాయి అంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు.

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. గులాబీ దళపతి కేసీఆర్‌..రోజు 2 లేదా 3 సభల్లో పాల్గొంటూ ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరుగెట్టేలా చేస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ, గెలుపుకోసం అన్ని విధాల శ్రమిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు కోదాడ చేరుకొని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. అనంతరం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో, తరువాత ఆలేరులో పర్యటించి ప్రసంగిస్తారు. ఆలేరు సభ అనంతరం తిరిగి హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ నెల 31న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ సభల్లో సీఎం పాల్గొననున్నారు. రేపు 30న జుక్కల్‌, బాన్సువాడ, నారాయణ్‌ఖేడ్‌లలో కేసీఆర్ పర్యటించనున్నారు.

Tags:    

Similar News